అన్ని బంధాలు నిలబడవు : కంగనా

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో సర్వేశ్‌ మేవారా దర్శకత్వంలో వహించిన చిత్రం ‘తేజస్‌’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ .. పెళ్లిపై తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే గతంలో బ్రేకప్‌ అయిన రిలేషన్స్‌ గురించి చెప్పుకొచ్చింది. ‘‘ప్రతి అమ్మాయి తన పెళ్లి, కుటుంబం గురించి కలలు కంటుంది.

నేను కుటుంబ, వివాహ వ్యవస్థను ఎంతో గౌరవిస్తాను. ప్రతి ఆడపిల్లలాగే పెళ్లి చేసుకొని నాకంటూ ఓ కుటుంబం ఉండాలని కోరుకుంటాను. ఇదంతా రానున్న ఐదేళ్లలో జరుగుతుంది. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమైతే బాగుంటుంది’’ అని తెలిపింది.

తన రిలేషన్స్‌ గురించి చెబుతూ అనుబంధం, సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని అనుకోకూడదు. రిలేషన్‌షిప్స్‌లో అందరూ సక్సెస్‌ కాలేదు. నేను కూడా తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ఫెయిల్‌ అయ్యాను. దాని వల్ల నాకు మంచే జరిగింది.

నేను ప్రేమలో ఉన్నట్లైతే నా సమయాన్నంతా దానికి కేటాయించాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు ఆ బంధం నిలవలేదు. దేవుడు నన్ను ఆ దారి నుంచి పక్కకు జరిపి మంచి చేశాడు. లవ్‌ ఫెయిల్‌ వల్ల జరిగే ప్రయోజనాన్ని చాలామంది చాలా ఆ?స్యంగా తెలుసుకుంటారు. కానీ నేను చాలా త్వరగానే తెలుసుకున్నా’’ అని కంగనా అన్నారు. విడుదలకు సిద్ధమైన తేజస్‌ చిత్రంలో పైలెట్‌గా కనిపించనున్నారు కంగనా.