కారులో బాడీని కదిలిస్తూ కారును షేక్ చేసిన హీరోయిన్..?

సాధారణంగా డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉన్న వారు వారికి నచ్చిన సంగీతం వినపడితే చాలు వెంటనే వారి బాడీలో కదలికలు మొదలవుతాయి. ఈ క్రమంలోని వారికి తెలియకుండానే స్టెప్పులు వేస్తుంటారు. తాజాగా నటి ఏకంగా కారులో కూర్చుని అద్భుతమైన స్టెప్పులు వేయడంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ మాస్ బీట్ ఉన్న సాంగ్ కు అద్భుతమైన స్టెప్పులను కారులో కూర్చుని రెడ్ లైట్ కింద, నల్లని డ్రెస్ ధరించి డాన్స్ చేయడంతో ఏకంగా కారు ఊగిపోయింది. ఈ క్రమంలోనే వీడియోని పోస్ట్ చేస్తూ గాయ్స్ మీరు కూడా ఇలా మీ ప్రతిభను చూపించాలి అనుకుంటే నన్ను టాగ్ చేయండి అంటూ కామెంట్ చేశారు. ఆటో బైక్ ఎక్కడైనా సరే కుసు కుసు చాలెంజ్ లో పాటిస్పేట్ చేసి ఆ వీడియోను పంపించాలని కోరారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సెలబ్రిటీలలో స్పందిస్తూ తమ దైన శైలిలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

నటుడు నీల్ నితిన్ ముఖేష్ స్పందిస్తూ డాన్స్ టెక్నికల్ గా ఎంతో అద్భుతంగా వచ్చిందని ఫెంటాస్టిక్ ఎనర్జీ అంటూ కామెంట్లు చేశారు. సత్యమేవ జయతే 2 లోని ఈ పాటకు డాన్స్ చేయడం చాలా బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఈ వీడియో నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ పాటకి తనిష్క్ బాగాచి సంగీతం వహించగా జర ఖాన్, దేవ్ నేగి ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు.