బిగ్ బాస్ ఫేమ్ నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక నటుడిగా, టాప్ ర్యాప్ సింగర్ గా మంచి గుర్తింపు పొందిన నోయెల్ బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో నోయల్ ఆట తీరుకి ఎంతోమంది అతనికి అభిమానులుగా మారారు. బిగ్ బాస్ ద్వారా తన పాపులారిటీ పెంచుకున్న నోయల్ కి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. ఇటీవల కూడా నోయెల్ పంచతంత్ర కథలు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నోయెల్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యు ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యు లో నోయెల్ తన కెరీర్ గురించి, సినిమాల గురించి ఎన్నో విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌజ్ లో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని యాంకర్ అడగగా.. నోయెల్ స్పందిస్తూ బిగ్ బాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో నోయల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో సాధారణ మనుషులు ఎక్కువ రోజులు ఉండలేరు అని చెప్పుకొచ్చాడు. అక్కడ ఉన్న వారికి ప్రశంతత ఉండదు అని వెల్లడించాడు. బిగ్ బాస్ హౌజ్ లో తిండి, నిద్ర సరిగ్గా ఉండవని , అందువల్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకి కూడా తెలియదని చెప్పుకొచ్చాడు
సాధారణంగా అందరూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు . అందుకే బయట హాస్పిటల్స్ లో కానీ టెంపుల్స్ లో కానీ ఎక్కువగా ఒక కలర్ మాత్రమే ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో 300 కలర్స్ ఉంటాయి. అందువల్ల మనుషులు చాలా డిస్టర్బ్ అవుతుంటారు. ఆ వాతావరణంలో ఉన్న వారుకి టెన్షన్, కోపం, ఏడవడం, బాధపడటం లాంటివన్నీ వారికి తెలియకుండానే జరుగుతుంటాయని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌజ్ లో సరిగా నిద్ర కూడా ఉండదు . వాళ్ళు ఎప్పుడు లైట్స్ ఆపేస్తే అప్పుడు పడుకోవాలి. అది తెల్లవారు జామున 3 గంటలకి అయిన, 5 గంటలకి అయిన. మరీ ఉదయమే పెద్దగా సౌండ్ పెట్టీ పాటలు పెడతారు . అందువల్ల అక్కడ ఉన్న వారికి నిద్ర సరిగా ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ అనేది లైఫ్ లో ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా నోయెల్ బిగ్ బాస్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఫైనల్ అవుతున్నాయి.