ఫ్లాప్ హీరోయిన్ తో నితిన్ హ్యాట్రిక్ సినిమా .. వర్కౌట్ అవుతుందా ..?

టాలీవుడ్ లో మేఘా ఆకాష్ వరసగా నితిన్ తో రెండు సినిమాలు చేసింది. లై, ఛల్ మోహన రంగా. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై’ మీద నితిన్ ఎన్నో అంచనాలు పెట్టుకుంటే దారుణంగా ఫ్లాపయి నితిన్ తో పాటు ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న లై సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది.

Nithiin Throws No Tantrums - Megha Akash

ఆ తర్వాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో దర్శకత్వంలో ఛల్ మోహన రంగా సినిమా చేశాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్టోరీ తో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. అలాగే తన డై హార్ట్ ఫ్యాన్ అయిన నితిన్ హీరో కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇంత భారీ టీం నిర్మిచిన ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా మేఘా ఆకాష్ నే తీసుకున్నారు. కాగా ఈ సినిమా కూడా ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

పవన్ కళ్యాణ్ వీరాభిమాని ప్రభాస్ ని ఫాలో అవడమేంటీ..? |

అయితే తాజా సమాచారం నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసి ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడిన మేఘా ఆకాష్ మరోసారి నితిన్ కి జంటగా నటిస్తుందని తెలుస్తుంది. ఇదే గనక నిజమైతే మేఘా ఆకాష్ లక్కీ అని చెప్పాలి. మరి ఈసారైనా హిట్ అందుకుంటుందా లేదా చూడాలి. ఇక ఈ సినిమా చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ కాగా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా ఫిక్సైయ్యారు. కాగా నితిన్ కీర్తి సురేష్ నటించిన రంగ్ దే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుండగా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.