వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘తమ్ముడు’

హీరో నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు నితిన్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నితిన్‌ బర్త్‌ డే సందర్భంగా తాను నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌ నుంచి టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సినిమా ‘తమ్ముడు’ అనే టైటిల్‌తో వస్తుండగా.. ఈ చిత్రానికి ‘వకీల్‌ సాబ్‌’ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ లోగో విడుదలైంది. ఈ పోస్టర్‌లో నితిన్‌ మాస్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు.

ఈ పోస్టర్‌ గమనిస్తే.. నితిన్‌ బస్‌పై కూర్చొని సుబ్రమణ్య స్వామి ఆయుధం పట్టుకుని కనిపిస్తున్నాడు. నితిన్‌ గత చిత్రాలకు భిన్నంగా.. చాలా క్రియేటివ్‌గా ఈ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తుండగా.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీష్‌ సినిమాను నిర్మిస్తున్నాడు.