Nithin New Film : బన్నీ డైరెక్టర్ తో నితిన్ కొత్త సినిమా…. పూజ కార్యక్రమాలతో ప్రారంభం….!

Nithin New Film : నితిన్ గతఏడాది వరుస సినిమాలు తీసిన విజయానికి మాత్రమే ఆమడ దూరం లో నిలిచిపోయాడు కేవలం రంగ్ దే మాత్రమే పర్వాలేదానిపించింది. ఇక మాస్ట్రో చెక్ బాగానే నిరాశపరిచాయి. ఈ యంగ్ హీరో హిట్ కొట్టి చాలా కాలమైంది. ఇక ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీ అయ్యాడు నితిన్.

నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజిక వర్గం’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నితిన్ పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీస్ గా నటించబోతున్నాడని పోస్టర్ విడుదలతో అర్థమైంది మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా విజయం పై ఆశలు పెట్టుకునందు నితిన్.

ఇక ఇపుడు ఇంకో కొత్త సినిమా కు కొబ్బరికాయ కొట్టాడు నితిన్. వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పేసాడు. వక్కంతం వంశీ రచయిత గా కిక్ రేసు గుఱ్ఱం సినిమా కు పనిచేసారు. ఇక అయినా మొదటి సినిమా డైరెక్టర్ గా బన్నీ తో తీసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఇపుడు వంశీ రెండవ సినిమాను నితిన్ తో తీయబోతున్నారు. నితిన్, శ్రీలీల జంటగా కొత్త సినిమా పూజా కార్యమాలతో ఘనంగా ప్రారంభమైంది.ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ వారితో కలిసి శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.