ఇడియట్స్, స్టుపిడ్స్ అంటూ ఫైర్.. ‘కార్తీక దీపం’డాక్టర్ బాబు కోపానికి కారణమిదే!!

Nirupam Paritala Says that Manjula Paritala Account Is Recovered

రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు వారెవ్వరూ ఉండరు. కార్తీక దీపంలో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ఎంతో ప్రత్యేకం. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్‌లకు స్టార్ స్టేటస్ లభించింది. వీరి క్రేజ్‌ తెలియాలంటే సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్‌ను చూడాలి. వీరి రచ్చ స్టార్ హీరో, హీరోయిన్‌ల రేంజ్‌లో ఉంటుంది. ఇక వీరి నటనతో కార్తీక దీపం టీఆర్పీని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు.

Nirupam Paritala Says that Manjula Paritala Account Is Recovered
Nirupam Paritala Says that Manjula Paritala Account Is Recovered

అలాంటి డాక్టర్ బాబుకు రియల్ లైఫ్‌లో కోపం వచ్చింది. నిరుపమ్ పరిటాల భార్య మంజుల. ఆమె కూడా సీరియల్ నటే. వీరిద్దరి జంటకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది. అయితే మంజుల పరిటాల సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని, దాన్ని ఎవ్వరూ ఫాలో అవ్వకండి.. కొత్త అకౌంట్‌ను ఫాలో అవ్వండని కోరాడు. అయితే తాజాగా నిరుపమ్ మరో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో నిరుపమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తన భార్య మంజుల పరిటాల ఖాతా రికవరీ అయిందని, మళ్లీ పాత అకౌంట్ చేతికి వచ్చిందని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో నిరుపమ్ హ్యాకర్స్‌పై ఫైర్ అయ్యాడు. ఎంతో మంది స్నేహితుల మద్దతు, ప్రేమ, కష్టం వల్ల అకౌంట్ రివకరీ అయింది.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. బయట చాలా మంది ఇడియట్స్, స్టుపిడ్స్, రాస్కెల్స్ ఉన్నారు.. వారంతా మిస్ యూజ్ చేస్తారు.. మనల్ని తప్పుదారి పట్టిస్టారు..మళ్లీ మీ ప్రేమను మంజులపై చూపండి అని నిరుపమ్ పోస్ట్ చేశాడు.