డాక్టర్ బాబుకు ఏమైంది.. ‘కార్తీకదీపం’కు గుడ్ బై చెప్పనున్నాడా?

కార్తీక దీపం సీరియల్‌లో నిన్నటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. హిమ బాధను చూడలేక కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హిమకు ఇచ్చిన మాట ప్రకారం తల్లిదండ్రులు వెతికి తీసుకొచ్చేందుకు ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. తన గురించి వెతకొద్దు అని చెప్పి వెళ్లిపోయాడు. అంటే సీరియల్‌లో దాదాపు డాక్టర్ బాబు ఇక కనిపించకపోవచ్చనే అనుమానాలు రేకెత్తాయి.

Nirupam Paritala Out From Karthika Deepam
Nirupam Paritala Out From Karthika Deepam

కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసేందుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా డాక్టర్ బాబు గొంతు మారిపోయింది. ఆ పాత్రకు ఎవరో డబ్బింగ్ చెబుతున్నారు. ఇదే కాదు నిరుపమ్ నటిస్తున్న కుంకుమ పువ్వు సీరియల్‌లో సందీప్ పాత్రకు వేరే వాళ్లు డబ్బింగ్ చెబుతున్నారు. హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లోనూ వేరే గొంతే వినిపిస్తోంది. ఇలా పలు సీరియళ్లతో బిజీగా ఉండటం మూలానే డబ్బింగ్ చెప్పడం కుదరడం లేదని టాక్.

Nirupam Paritala Out From Karthika Deepam
Nirupam Paritala Out From Karthika Deepam

అయితే ఇకపై కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు కనిపించకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌తో బిజీగా ఉండటం మూలానే అటు షిఫ్ట్ అయినట్టు కనిపిస్తోంది. డాక్టర్ బాబు పాత్ర లేకుండా కథను నడిపించే విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరి కార్తీక దీపంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.