Niranjan Reddy: అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించిన నిరంజన్ రెడ్డి ఎవరు.. తన ఫీజు ఎంతో తెలుసా?

Niranjan Reddy: పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో భాగంగా మహిళా అభిమాని మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసింది అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో సంచలనంగా మారింది. కేవలం ప్రభుత్వ భద్రత లోపం కారణంగానే ఈ సంఘటన జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది కానీ ఇందుకు అల్లు అర్జున్ ని బాధ్యున్ని చేసి ఆయనను జైలుకు పంపించడంతో ఈ అరెస్టు వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు అంతేకాకుండా ఈ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది.

ఇక అల్లు అర్జున్ కు 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇలా ఒకసారి రిమాండ్ విధించిన తర్వాత బెల్ రావడం కష్టమే అయినప్పటికీ అల్లు అర్జున్ తరపు నిరంజన్ రెడ్డి అనే న్యాయవాది గట్టిగా వాదనలు వినిపించి అల్లు అర్జున్ కు బెయిలు తీసుకువచ్చారు. దీంతో ఈ నిరంజన్ రెడ్డి ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. నిరంజన్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి ఎంతో సన్నిహితుడు ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలో పలు సినిమాలను చేశారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు కూడా ఈయన నిర్మాతగా వ్యవహరించారు.

ఇకపోతే నిరంజన్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా ఈయన వైకాపా రాజ్యసభ సభ్యుడు కూడా కావటం విశేషం. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగి గతంలో సినీ సెలెబ్రిటీలు పాల్గొన్న సమయంలో జరిగిన తొక్కిసలాట గురించి, అలాగే రాజమండ్రి గోదావరి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి గురించి కూడా ఈయన కోర్టులో బలంగా వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది.

ఇలా బలమైన వాదనలను వినిపించిన ఈయన అల్లు అర్జున్ కు బెయిలు తీసుకువచ్చారు. దీంతో ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు అయితే అల్లు అర్జున్ కు ఇలా బెయిల్ ఇప్పించినందుకు ఈయన ఎంత మొత్తంలో ఫీజు తీసుకున్నారనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా నిరంజన్ రెడ్డి ఒక కేసు టేకప్ చేసి గంట పాటు వాదనలను వినిపిస్తే ఈయన సుమారు ఐదు లక్షల వరకు ఫీజు తీసుకుంటారట ఇక అల్లు అర్జున్ కేసులో గంటకు 10 లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకున్నారని సమాచారం.ఇకపై ఈ కేసు విషయంలో నిరంజన్ రెడ్డి వాదించాల్సి ఉంటుంది అని తెలుస్తుంది.