‘స్వయంభూ’లో నిఖిల్‌ కు జోడీగా సంయుక్త మీనన్!

ఇండస్టీల్రో టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అయితే ఆ అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఇప్పుడీ మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ తెలుగు చిత్రసీమలో గోల్డెన్‌ లెగ్‌ బ్యూటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ’బింబిసార’ , ’భీమ్లా నాయక్‌’, ’సార్‌’, ’విరూపాక్ష’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ నాలుగు సక్సెస్‌ లు అందుకోవడంతో టాలీవుడ్‌ లక్కీ ఛార్మ్‌ గా ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకుంది. త్వరలోనే కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ చిత్రంతో ఆడియెన్స్‌ ముందుకు రాబోతుంది. అయితే ఇప్పుడీ కేరళ కుట్టికి మరో బడా ఛాన్స్‌ వచ్చింది.

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌ లో హిట్‌ అందుకున్న నిఖిల్‌.. ఇప్పుడు వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ‘స్వయంభూ’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ కూడా చేస్తున్నారు. నిఖిల్‌ కెరీర్‌ లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కు తోంది. ఇప్పుడీ చిత్రంలోనే నిఖిల్‌ సరసన నటించేలా సంయుక్త మీనన్ ఛాన్స్‌ ను అందుకుంది. ;స్వయంభూ; సినిమా విషయాని కొస్తే.. దీని అర్థం స్వయంగా ఉద్భవించినదని అర్థం. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ;ఠాగూర్‌; మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌ పై భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లో యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతున్న యోధుడిలా కనిపించారు నిఖిల్‌.

ఈ మూవీ సోసియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇది నిఖిల్‌కు 20వ సినిమా కావడం విశేషం. ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ నెల 18న సినిమా షూటింగ్‌ లాంఛ్‌ కానుంది. ఇక అలానే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభించుకోనుంది. ఈ సినిమాకి రవి బస్రూర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మనోజ్‌ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే నిఖిల్‌.. ‘స్వయంభూ’తో పాటు ‘ది ఇండియా హౌస్‌’ అనే మరో పాన్‌ ఇండియా సినిమాను చేస్తున్నారు.

దీనికి రామ్‌ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అండ్‌ వి మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ‘స్పై’ చిత్రంతో చివరిగా భారీ డిజాస్టర్‌ అందుకున్న నిఖిల్‌.. ఈ రెండు భారీ చిత్రాలతో ఎలాంటి రిజల్ట్‌ ను అందుకుంటారో చూడాలి!