సెలబ్రెటీలు కూడా సలార్ సినిమాను తొలిరోజే చూసి థ్రిల్ అవుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలు నిఖిల్, నవీన్ పోలిశెట్టి అయితే సినిమా చూసి రివ్యూలు కూడా పెట్టేశారు. ఇప్పుడే సలార్ సినిమా చూశా. మాన్‌స్టర్ బ్లాక్‌బస్టర్ అంతే.. ప్రభాస్ ఒక అద్భుతం.
అతను స్క్రీన్‌పై ఉన్నంతసేపు గూస్‌బంప్స్ వచ్చేస్తాయంటూ నిఖిల్ సిద్దార్థ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా రివ్యూ ఇచ్చాడు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్‌కు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే బ్లాక్‌బస్టర్ సలార్ మూవీని తప్పక చూడాలని ఫ్యాన్స్‌కు సజెస్ట్ చేశాడు.
ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సలార్ చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ (ఎక్స్) ద్వారా పంచుకున్నాడు. సలార్ సినిమా థియేటర్ల దగ్గర ఎంతో జోష్ నింపిందని తెలిపాడు. చాలా రోజుల నుంచి అందరూ ప్రభాస్ అన్నను ఇలా చూడాలనే వెయిట్ చేస్తున్నారని అన్నాడు. చెప్పాను కదా బాక్సాఫీస్ బద్దలయిపోద్ది అని అంటూనే.. ప్రభాస్‌కు, సలార్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పాడు.