పాన్ ఇండియా కాదట.! పెనం మీద స్టార్ అట.!

నిఖిల్ సిద్దార్ధకి ఏమయ్యింది.? ఔను, ఏమవుతుంది.? ఈ మధ్యనే ‘స్పై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కదా.! సినిమా బాగాలేదన్న విమర్శల సంగతెలా వున్నా, ఫర్వాలేదన్పించేస్తోంది ‘స్పై’.

నిజానికి, నిఖిల్ అయితే హ్యాపీగానే వున్నాడు. నిర్మాతలు కూడా అంతే. మోస్తరుగా ఖర్రచు చేశారు.. పబ్లిసిటీతో బాగానే ఆకట్టుకున్నారు.. వసూళ్ళు కూడా బాగానే వచ్చాయ్.

అయితే, ‘ఇకపై అన్నీ పాన్ ఇండియా సినిమాలే..’ అని ప్రకటించిన నిఖిల్, పాన్ ఇండియా స్థాయిలో మాత్రం తనక క్రేజ్‌ని మరింత పెంచుకోలేకపోయాడు.

‘పాన్ ఇండియా స్టార్ కాదు.. పెనం మీద స్టార్..’ అంటూ నిఖిల్ మీద సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నిఖిల్ మాత్రం, ‘పాన్ ఇండియా సబ్జెక్టులైతేనే నా దగ్గరకు రండి’ అని అప్‌కమింగ్ దర్శకులకీ, నిర్మాతలకీ సూచిస్తున్నాడట.