యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ కొత్త సినిమా ‘స్పై’ వివాదాల్లోకెక్కింది. సినిమా రిలీజ్ అవుతుందా.? లేదా.? అన్న విషయమై మీమాంశ ఎదురయ్యింది. కారణం, హీరో నిఖిల్ సిద్దార్ధ అట.!
సినిమాకి సంబంధించి కొంత బ్యాలన్స్ వర్క్ వుండిపోయిందట. అంటే, అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలే.! కానీ, సినిమా రిలీజ్‌కి టైమ్ దగ్గర పడిపోయింది. ఈ నేపథ్యంలో, విడుదల వాయిదా వేయాలని నిర్మాతల్ని కోరుతున్నాడట నిఖిల్.
కానీ, నిర్మాత అందుకు సుముఖంగా లేడట. దాంతో, నిఖిల్ అలిగాడట. ఇదీ జరుగుతున్న ప్రచారం.! కానీ, తెరవెనుకాల వ్యవహారాలు వేరే వున్నాయ్. సినిమాల్ని బ్లాక్‌మెయిల్ చేయడం ఇటీవల సోకాల్డ్ మీడియాకి అలవాటైపోయింది.
అదే వ్యవహారం ఇక్కడా నడుస్తోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. నిర్మాతలతో నిఖిల్‌కి గొడవెందుకు వుంటుంది.? హీరోతో నిర్మాతలెందుకు పంచాయితీ పెట్టుకుంటారు.? ఇందులో ఒక్కటే డౌటానుమానం.. నిఖిల్ ఎందుకు, ఈ సినిమా తాజా లిరికల్ సాంగ్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పోస్ట్ చేయలేకపోయాడు.?