Niharika : డ్రగ్స్ వివాదం అనంతరం కొత్త లుక్ లో కెమెరా ముందుకు నిహారిక…!

Niharika : నిహారిక కొణిదెల మెగా డాటర్ గానే కాకుండా అడపాదడపా సినిమాలలోనూ వెబ్ సిరీస్ ల లోను నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కూడా నిహారిక తన కెరీర్ కొనసాగించింది. అయితే తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై జరిగిన దాడులు ఆ పై అందులో పోలీసుల అదుపులో సెలబ్రిటీలు ఉండడంతో బాగా వైరల్ అయింది. ఈ దాడిలో 150 మంది యువతీ యువకులు పట్టుబడ్డారు.అయితే నిహారిక పోలీస్ స్టేషన్ లో కనిపించడం సంచలనంగా మారింది. నిహారిక తో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్ కుమారుడు, ఇక మాజీ డీజీపీ కూతురు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయం లో నిహారిక మీద నెగిటివ్ ట్రోల్ల్స్ ఐతే ఆగట్లేదు. ఈ డ్రగ్స్ ఇష్యూ అనంతరం ఇటీవల నిహారిక తన కొత్త హాబీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నీహారిక ఏ వివాదాల అనంతరం అసలు బయట కనిపించడం లేదు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కూడా డిలీట్ చేశారు. అప్పటి నుంచి నీహారిక అజ్ఞాతం లోనే ఉన్నారు.

అయితే తాజాగా ఈ వివాదం జరిగిన తర్వాత మొదటిసారి నిహారిక ఫోటోలు బయటికొచ్చాయి. నిహారిక తన జిమ్ ట్రైనర్ పక్కన నిల్చొని కొన్ని క్రేజీ ఫోజులిచ్చారు . ఈ ఫోటోలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో నిహారిక కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. షార్ట్ హెయిర్ కట్ తో, జిమ్ ఔట్ ఫిట్ ధరించిన నిహారిక చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ న్యూ లుక్ వెనుక కారణం ఏంటి అన్నది తెలియదు. క్యాజువల్ గా తన లక్ చేంజ్ చేసుకున్నారా లేకపోతే ఏదైనా సినిమా కోసమా అన్న విషయం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.