గంగుబాయ్ అవతారం ఎత్తిన నిహారిక.. సూపర్ అంటూ కామెంట్ చేస్తున్న బన్నీ వైఫ్?

మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ సుపరిచితమే యాంకర్ గా తన సినీ కెరియర్ ప్రారంభించిన ఈమె అనంతరం పలు సినిమాలలో నటిగా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారిన ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.ఈ విధంగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉండే నిహారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమె ఎన్నోసార్లు నేటిజన్ ల ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఓ పార్టీలో భాగంగా గంగుబాయ్ అవతారం ఎత్తారు. అచ్చం గంగుబాయ్ సినిమాలో అలియా భట్ గెటప్ లో సందడి చేస్తున్న ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా గంగూని ఛానెలింగ్‌ చేస్తుంది. మీకు తెలుసో, తెలియదో, నేను ఇలాంటి కాస్ట్యూమ్స్‌ పార్టీలను ఇష్టపడతానని తెలిపింది.

ఈ వీడియోలో ఇద్దరు కుర్రాళ్ళు తనను వెనకనుంచి ఆట పట్టిస్తూ ఉంటారు. వీరిని ఉద్దేశిస్తూ ఆ కోతులను పట్టించుకోకండి అంటూ కామెంట్ చేశారు. నిహారిక గెటప్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియో పై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పందిస్తూ సూపర్ అంటూ కామెంట్ చేశారు. గంగుబాయ్ గెటప్ లో ఈమె అచ్చం అలియాను పోలి ఉందని చెప్పాలి.