ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అందాల నిధులను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు ఫ్లాపులైనా సరే… ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేసినా సరే తానేంటో నిరూపించుకుంది. మళ్లీ తన సత్తా చాటి ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటిసారిగా సక్సెస్ రుచి చూసిన నిధి అగర్వాల్‌కు భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడింది. అలా వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియా ద్వారా మరింత పెంచేసుకుంటోంది. అందమైన క్యూట్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అందాల నిధులను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. తాజాగా ఈ నిధి ఓ వీడియోను షేర్ చేసింది.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్‌లో బెట్టింగ్ పెట్టండి అంటూ నిధి రచ్చ చేస్తోంది. ఫెయిర్ ఫ్లే క్లబ్ అంటూ ఓ వెబ్ సైట్ గురించి చెబుతూ నిధి ఓ వీడియోను షేర్ చేసింది. అటెన్షన్ బెట్టింగ్ గురుస్.. మీకు ఇష్టమైన ఆటలపై బెట్ కాసేందుకు ఓ ప్లేస్ ఉంది. fairplay.club అనే దాంట్లో లాగిన్ అవ్వండి అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. నిధి ప్రస్తుతం గల్లా అశోక్ సరసన నటిస్తోంది.