ఎన్టీయార్ 30 మీద రీషూట్ పుకార్లు.!

ఆలూ లేదు చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్న చందంగా మారింది మొదట్నుంచీ ‘ఎన్టీయార్ 30’ సినిమా. ఇదిగో తోక అంటే అదిగో పులి.. అన్నట్లుగా కూడా. సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు. పట్టాలెక్కించడానికి సంవత్సరం పైగా టైమ్ తీసుకున్నారు. ఈ లోపల ఎన్నో పుకార్లు. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కింది.

కష్టపడి ఎన్టీయార్ బర్త్‌డే ఫస్ట్ లుక్‌తో పాటూ, టైటిల్ రిలీజ్ చేశారు. ఇదే పెద్ద కత్తి మీద సాములా తయారైంది చిత్ర యూనిట్‌కి. ఇదిలా వుంటే, తాజాగా సినిమా అవుట్ పుట్ బాగా రాలేదంట. రీ షూట్లు స్టార్ట్ అయ్యాయట అంటూ పుకార్లు పోటెత్తాయ్. ఎంత మేర సినిమా పూర్తయ్యిందని అప్పుడే ఇలాంటి పుకార్లు.?

కేవలం ఇదంతా దుష్ప్రచారమేనా.? లేక నిజంగానే సినిమా బాగా రాలేదా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయ్. ఎంతైనా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా విషయంలో అటు ఎన్టీయార్ కానీ, ఇటు డైరెక్టర్ కొరటాల శివ కానీ, ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిందే. లేదంటే ‘దేవర’ పని అంతే సంగతి.!