సలార్.. డిసెంబర్.! కానీ, నమ్మేదెవర్.?

ప్రభాస్ ‘సలార్’ సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతోందన్నది తాజా ఖబర్.! నమ్మొచ్చా.? నమ్మాల్సిందే. డిసెంబర్‌లోనే వస్తుందని చూచాయిగా చిత్ర దర్శకుడు సంకేతాలు పంపుతున్నాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాలో కొన్ని సీన్స్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ విషయమై రాజీ పడలేక, విడుదలను వాయిదా వేయించాడట. లేకపోతే, ఈ సెప్టెంబర్‌లోనే ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి వుండాలి.

ఇదిలా వుంటే, ‘సలార్’ని సంక్రాంతికి పంపాలనుకున్నారుగానీ, డిసెంబర్‌కే ఫిక్సయిపోయారు. ఈ మార్పు వెనుక కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. సంక్రాంతి సినిమాల మీద దెబ్బ పడకూడదనే, ‘సలార్’ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందన్నది ఓ వాదన మాత్రమే.

మరోపక్క, డిసెంబర్‌లో సలార్ రావడాన్ని అప్పుడే నమ్మేయలేమంటున్నారు కొందరు. అధికారిక ప్రకటన వస్తే తప్ప, ఈ విషయమై ఎటూ చెప్పలేమని ప్రభాస్ అభిమానులూ చెబుతుండడం గమనార్హం.

ఎవరి గోల వారిదే.! అయినా, ప్రభాస్ సినిమాలు చెప్పిన సమయానికి రావడం అనేది జరగడంలేదు ఈ మధ్యకాలంలో. ఎందుకీ పరిస్థితి.? అంటే, కేవలం ప్రభాస్ విషయంలోనే కాదు, చాలామంది హీరోలకి ఈ సమస్య ఎదురవుతోంది. దానికి కారణాలనేకం.

‘సలార్’లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.