New Nayanthara : ఆ నయనతారకి ఈ ఈ నయనతార పోటీ ఇస్తుందా.?

New Nayanthara :  ‘జెంటిల్‌మెన్’ సినిమా గుర్తుంది కదా.. నాని హీరోగా వచ్చిన ‘జెంటిల్‌మెన్’ కాదండోయ్. అప్పుడెప్పుడో అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా జెంటిల్‌మెన్. అదో సంచలనం అప్పట్లో. అర్జున్ కెరీర్‌లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచిందా సినిమా.

ఎప్పటి నుంచో ఈ సినిమాకి సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. కానీ, కుదరడం లేదు. లేటెస్టుగా ఈ సీక్వెల్ పనులు వేగవంతమయినట్లు తెలుస్తోంది. విషయం అది కాదు ఇప్పుడు. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా నయనతార పేరు వినిపిస్తోంది.ఇందులో వింతేముంది. సౌత్ క్వీన్ నయనతారకు ఆ సత్తా వుందిలెండి అనుకుంటున్నారా.?
అయితే మీరు పొరపడ్డట్లే. మనం మాట్లాడుకుంటున్న నయనతార వేరే. ఈమె నయనతార చక్రవర్తి. మలయాళ బ్యూటీనే. సౌత్ క్వీన్ నయనతార పేరుతో ఎంట్రీ ఇస్తుండడంతో ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమా ఇంకా సెట్స్‌ పైకి వెళ్లకుండానే ఈ నయనతార చక్రవర్తి పేరు తెగ మార్మోగిపోతోంది.
మలయాళ భామ కాబట్టి ఎలాగూ యాక్టింగ్ టాలెంట్ గురించి మాట్లాడుకోనే అక్కర్లేదు. ఓ సంచలన విజయం అందుకున్న సినిమాతో తెరంగేట్రం చేస్తోంది కాబట్టి, అమ్మడి కెరీర్ ఏ టర్న్ తీరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే, సినిమా గానీ హిట్ అయ్యిందంటే, ఈ నయనతార సౌత్ క్వీన్ నయనతారకు గట్టిపోటీనే అవుతుందేమో చూడాలి మరి