దిల్ రుబా టైటిల్ తో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. తొందరపడుతున్నాడంటారా?

క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు విశ్వ కరుణ. ఇప్పటివరకు కే ఏ 10 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్. దిల్ రుబా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేసి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

అంతేకాకుండా సినిమాలో హీరో ప్రేమతో పాటు క్రోధాన్ని కూడా చూడబోతున్నారంటూ ప్రకటించారు. ఈ పోస్టర్లో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్, ఆటిట్యూడ్ తో కనిపిస్తున్నాడు. ఒక చైర్ లో కూర్చొని పక్కకు చూస్తూ సిగరెట్ తాగుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఆయన ముందు చాలామంది నిలుచొని ఉన్నారు. హిస్ లవ్ హిజ్ యాంగర్ అనే కొటేషన్ కిరణ్ అభవరం క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది.ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారే గమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లి ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రవి, జోజో జోష్, రాకేష్ రెడ్డి, సారేగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తుండగా డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

క సూపర్ హిట్ తర్వాత కిరణ్ అభవరం చేస్తున్న సినిమా దిల్ రుబా కావటంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే క సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర టైం తీసుకున్న కిరణ్ ఆ సినిమా హిట్ అవ్వగానే నెక్స్ట్ సినిమా ప్రకటన, రిలీజ్ డేట్ కూడా వదిలేసాడు. కిరణ్ ఎందుకు అంత తొందర పడుతున్నాడు అని చాలామంది డౌట్ పడుతున్నారు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది. కిరణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ తప్పుతాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతని ఫ్యాన్స్.