‘సలార్’ విడుదలకు సిద్ధమైంది. ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కాలేదు. అయితే, విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్‌కి సంబంధించిన చిన్నా చితకా పనులు పెండింగ్‌లో వున్నాయని తెలుస్తోంది.
ముఖ్యంగా గ్రాఫిక్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయట. అయినా కానీ, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలన్న పట్టుదలతో చిత్ర యూనిట్ వుంది. డిశంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది.
ప్రబాస్ స్థాయి సినిమా అంటే, ఈ పాటికే ప్రమోషన్లు షురూ చేయాలి. కానీ, ఆ హడావిడే కనిపించడం లేదింతవరకూ. దాంతో ప్రబాస్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదిలా వుంటే, ‘సలార్’పై వస్తున్న గాసిప్స్ ఇంకో పక్క వేధిస్తున్నాయ్.
సినిమాకి కత్తిరింపులు జరుగుతున్నాయన్నది తాజా గాసిప్. అందుకే ఆలస్యం అవ్వాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ వాయిదా.. అంటే.! కానీ, కత్తిరింపుల పర్వం మాత్రం తప్పదంటున్నారు.
లెంగ్త్ దృష్టిలో పెట్టుకుని.. అలాగే గ్రాఫిక్స్ దృష్ట్యా కూడా కొన్ని సీన్లు కత్తిరించాల్సి వస్తోందట. అయితే తాత్కాలికంగా కొన్ని కత్తిరింపు సీన్లను పక్కన పెడతారట. ఆ తర్వాత సిట్యువేషన్ బట్టి యాడ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.
కాదు, కాదు, రిలీజయ్యాకా సిట్యువేషన్ బట్టి.. వాటిని యాడ్ చేస్తారట.. అంటున్నారు ఇంకొందరు. అదీ కాదు, పార్ట్ 2లో ఆ సన్నివేశాలు యాడ్ చేయాలని అనుకుంటున్నారట.. అంటూ మరో ప్రచారం.. ఇలా రకరకాల ప్రచారాలు, అనుమానాలు.. ‘సలార్’పై. ఏం జరుగుతుందో చూడాలి మరి.