ఇండియన్ సినిమా దగ్గర ఉన్న ఒక మిత్ ని అయితే దర్శకుడు రాజమౌళి బ్రేక్ చేసాడు. ఇండియన్ సినిమా దగ్గర చేసే ఏ సీక్వెల్ సినిమా కూడా ఆడదు అనే నమ్మకాన్ని రాజమౌళి బాహుబలి 2 తో బ్రేక్ చేసాడు. దీనితో అక్కడ నుంచి ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ పర్వం స్టార్ట్ అయ్యింది.
అలా బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ ని తెచ్చుకొని పాన్ ఇండియా భాషల్లో భారీ రికార్డులు కొట్టిన చిత్రమే “కేజీఎఫ్ 2”. మరి దీనికి కన్నడ యంగ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా యాష్ హీరోగా నటించాడు. దీనితో ఈ సీక్వెల్ పెద్ద హిట్ అయ్యింది. అయితే నెక్స్ట్ ఈ సినిమాకి కూడా సీక్వెల్ ని అనౌన్స్ చేయడంతో దీనిపై కూడా భారీ అంచనాలు సెట్ చేసుకుంది.
మరి ఈ సినిమాపై ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది అని చెప్పాలి. తాజాగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ బహుశా తాను కేజీఎఫ్ 3 ని తెరకెక్కించకపోవచ్చు అని చెప్పాడు. అంటే కేజీఎఫ్ 3 లేనట్టేనా అని అనుకుంటే అలా కాకుండా ఇప్పుడు పలు హాలీవుడ్ సినిమాల్లో ఎన్నో సినిమాల ఫ్రాంచైజ్ లు చూసినట్టుగా అయితే వాటి సీక్వెల్స్ కి కథ ఒకేటే అయినా మరో దర్శకుడు ఆ సీక్వెల్ ని తెరకెక్కిస్తారు అలా కేజీఎఫ్ చాప్టర్ 3 ని కూడా మరో సరైన దర్శకుడు తెరకెక్కించే ఛాన్స్ ఉంది.
అయితే ఆ సినిమాని వేరే దర్శకుడు వర్క్ చేయొచ్చు లేదా తానే చేయొచ్చు అని కూడా చెప్పాడు. మరి ఈ రెండు ఆప్షన్స్ లో అయితే చాలా మంది ఖచ్చితంగా నీల్ డైరెక్షన్ లోనే చూడాలి అనుకుంటారు. అయితే దీనికి చాలా సమయం ఉంది. మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎపుడు మొదలవుతుందో ఎవరి డైరెక్షన్ లో మొదలవుతుందో చూడాలి.