విజయ్ దేవరకొండ పోస్టర్స్ పై నేటిజన్స్ ట్రోలింగ్.. అండర్ వేర్ యాడ్ అంటూ కామెంట్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోని చిత్ర బృందం సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన న్యూడ్ ఫోటో విడుదల చేయడంతో ఈ ఫోటోపై పెద్ద ఎత్తున నేటిజెన్లు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ తీవ్ర ట్రోలింగ్ కి గురవుతున్నాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ దేవరకొండ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం అండర్ వేర్ ధరించి మాత్రమే ఉన్న భారీ కట్ అవుట్ ను హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులు ఏర్పాటు చేశారు.ఇక ఈ కటౌట్ చూసిన ఎంతో మంది నేటిజన్ లు పెద్ద ఎత్తున ఈ కటౌట్ పై ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్స్ స్పందిస్తూ ఇది కటౌట్ల లేదని, అండర్ వేర్ యాడ్ లా ఉందని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ ప్లేయర్ గా కనపడతారు. అందుకే ఆయనకు సంబంధించిన పోస్టర్స్ ఇలాంటివి కావడంతో ఈయన పోస్టర్ ట్రోలింగ్ కు గురవుతున్నాయి.ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమాని కరణ్ జోహార్, పూరి కనెక్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచాయి.