Home News త‌ల్లికి వోడ్కా తాగిస్తున్న వ‌ర్మ‌.. పిచ్చి పీక్స్‌కు చేరిందంటున్న నెటిజ‌న్స్

త‌ల్లికి వోడ్కా తాగిస్తున్న వ‌ర్మ‌.. పిచ్చి పీక్స్‌కు చేరిందంటున్న నెటిజ‌న్స్

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరే ఓ సంచ‌ల‌నం. ఆయ‌న చేసే ప‌నులైతే మ‌రిన్ని వివాదాల‌ని సృష్టిస్తుంటాయి. న‌చ్చ‌ని వారిపై బ‌యోపిక్‌లు తీయ‌డం, య‌దార్ద ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమాలు చేస్తూ కాంట్ర‌వ‌ర్సీస్ చేయ‌డం వ‌ర్మ‌కు అల‌వాటు. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ మ‌న‌సులో ఏం అనుకున్నాడో అది బ‌య‌టకు చెప్పేస్తాడు. మొహ‌మాటం, సిగ్గు, భ‌యం అలాంటివి అత‌నికి ప‌రిచ‌యం కూడా లేవు. ఎప్పుడు వోడ్కా, అమ్మాయిల‌తో క‌లిసి ఎంజాయ్ చేసే వ‌ర్మ రీసెంట్ గా త‌న సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టాడు

Varma 800 | Telugu Rajyam

ఓ పోస్ట్‌లో త‌న త‌ల్లి, సోదరితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. దీవాళి బోరింగ్ పోగ‌ట్ట‌డానికి మా అమ్మ‌ని వోడ్కా సిప్ చేయ‌మ‌ని చెబుతున్నాను అంటూ కామెంట్ సెక్ష‌న్ లో రాశాడు. ఇది చూసిన నెటిజ‌న్స్ నువ్వు మాములోడివి కాదు వ‌ర్మ అని కామెంట్స్ పెడుతుంటే మ‌రి కొంద‌రు నువ్వు తాగేది స‌రిపోక నీ తల్లికి కూడా తాగిస్తున్నావా అంటూ మండిప‌డుతున్నారు. వ‌ర్మ నీ పిచ్చి పీక్స్ కు చేరిన‌ట్టుంద‌య్యా అంటూ నెటిజ‌న్స్ తమ‌కు తోచిన కామెంట్స్ రాస్తున్నారు.

వ‌ర్మ రూటే స‌ప‌రేటు. లాక్ డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు తీసి సంచ‌ల‌నం సృష్టించాడు. క్రైమ్, శృంగార భ‌రిత సినిమాలు చేసిన వ‌ర్మ త‌న సొంత ఛానెల్‌లోనే వీటిని విడుద‌ల చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌స్తుతం దిశా ఎన్‌కౌంట‌ర్, మ‌ర్డ‌ర్ అనే చిత్రాల‌ని చేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ వీటిని థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేస్తానంటున్నాడు. అనేక స‌మస్య‌లు ఈ చిత్రాల‌ని చుట్టుముడుతున్న‌ప్ప‌టికీ ,వాటిని త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించి సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ద‌ప‌డుతున్నాడు.

- Advertisement -

Related Posts

సుప్రీం కోర్టు తీర్పు ఉద్యోగ సంఘాలకు కనువిప్పు అనుకోవచ్చా ?

రాజకీయాల్లోకి రాజ్యాంగ వ్యవస్థలను లాగడం ఎంత తప్పో ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో స్పష్టమైంది.  ఎన్నికలు నిర్వహించడం అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం.  పద్దతి ప్రకారం ఈసీ ఎన్నికలు పెడతాను అంటే ప్రభుత్వం...

ప‌వ‌న్ సినిమాల‌లో యాదృచ్చిక అంశాలు.. ఆనందంలో అభిమానులు

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న డిమాండ్.. రేంజ్ వేరు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ హీరోగా వరుసగా సినిమాలను పూర్తి చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.....

Gouri G Kishan Latest Photos

Gouri G Kishan Popular actress in tamil, Gouri G Kishan latest photos in shooting spot, Gouri G Kishan beautiful images, Gouri G Kishan, Gouri...

చంద్రబాబుకు గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి.. అందరికీ ఫోన్లు 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టత వచ్చేసింది.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయయస్థానం తీర్పునిచ్చింది.  రాజ్యాంగ సంస్థలు వాటి పని అవి చేస్తాయని, ఎన్నికల...

Latest News