Nayanatara: అగ్ర కథానాయిక నయనతార జీవితంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ సిద్ధమైంది. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ దీనిని రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పలు విశేషాలను ఓటీటీ సంస్థ ప్రకటించింది.
’నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు నయనతార. కాలేజీ రోజుల్లో ఆమె పార్ట్‌టైమ్ మోడల్‌గా వర్క్ చేశారు. ఓ సందర్భంలో ఆమెను చూసిన దర్శకుడు సత్యన్ అంతికాడ్.. ’మనస్సిక్కరే’లో నటిగా అవకాశం ఇచ్చారు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. 2003లో పరిశ్రమలోకి వచ్చిన నయన్.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్ పరంగా ఎన్నో అవమానాలు, ఎత్తుపల్లాలు చూశారు. ’నేను రౌడినే’ సమయంలో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వీరి మధ్య ప్రేమ మొదలైంది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న నయన్ – విఘ్నేశ్ పెద్దల అంగీకారంతో 2022లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
నయనతార చిన్నప్పటినుంచి పెళ్లివరకూ సాగే ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. పెళ్లి వేడుక డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ప్లిక్స్ రూ.25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం దీని ప్రోమో విడుదల చేశారు. నయన గొప్ప నటి మాత్రమే కాదని.. మంచి మనసున్న వ్యక్తి అందులో విఘ్నేశ్ తెలిపారు.