మామూలుగా అయితే మనం ఏదైనా ఊరికి వెళ్లాలంటే.. ఏ బస్సో ఎక్కి వెళ్తాం లేదంటే కార్ వేసుుకుని వెళ్తాం. అయితే ఇది సామాన్య జనానికి అలవాటైన పద్దతి. అయితే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి నయనతార మాత్రం స్పెషల్ ఫ్లైట్‌లో గిరగిరా చక్కర్లు కొడుతోంది. నయనతార ఓనం పండుగకు కొచ్చిలో దిగింది స్పెషల్ ఫ్లైట్‌లోనే. అప్పుడే నయన్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కొచ్చిలో విఘ్నేష్ నయన్ ఓనం పండుగను ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆపై మళ్లీ గోవాకు చెక్కేశారు. గోవాలో నయన్ తల్లి కురియన్ బర్త్ డేను గ్రాండ్‌గా నిర్వహించారు. ఆపై ఈ జంట ఓ రెండు మూడు రోజులు గోవాలోనే ఎంజాయ్ చేశారు. ఆపై విఘ్నేష్ బర్త్ డేను అక్కడే నయన్ గ్రాండ్ లెవెల్‌లో సెలెబ్రేట్ చేసింది.
ఇక తాజాగా అక్కడి నుంచి మకాం ఎత్తేశారు. నిన్ననే చెన్నైకి బయల్దేరారు. అది కూడా మళ్లీ స్పెషల్ ఫ్లైట్‌లోనే. నయన్ ఈ రాజసాన్ని, లగ్జరీ లైఫ్‌ను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుఏం రాజసంరా నాయన.. స్పెషల్ ఫ్లైట్‌లో ప్రియుడితో నయన్ చక్కర్లుతున్నారు. ఎయిర్ పోర్ట్ రన్ వే వద్ద వీరిద్దరి దిగిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతైనా నయన్ కదా.. ఆమెకు ఉన్న రేంజ్, స్టార్డంకు తగ్గట్టు ఇలా స్పెషల్ ఫ్లైట్‌లో తిరగడం తప్పే లేదనిపిస్తోంది.