గాసిప్స్ : బాలీవుడ్ లో నో అనలేని ఆఫర్ అందుకున్న నయనతార?

ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ ఫిలిం ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా బాలీవుడ్ అని చెప్పాలి. అయితే మెయిన్ గా భాష పరంగా ప్రేక్షకులు ఎక్కువ ఉండడంతో ఎప్పటి నుంచో ఇండియన్ సినిమాకి ఫేస్ గా బాలీవుడ్ నిలవగా వారికి కూడా భారీ సంక్షోభం తప్పలేదు.

గత 2022 సినిమా అయితే అసలు దారుణం అని చెప్పాలి. మరి ఆ 22 అయ్యాక సరిగ్గా 2023 స్టార్ట్ అయ్యింది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రికార్డులు తిరగరాసింది. బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల సినిమా అందించిన షారుక్ ఈ సినిమా తర్వాత చేసిన నెక్స్ట్ సినిమానే “జవాన్” దీనితోని వరుసగా రెండో 1000 కోట్ల సినిమా కూడా షారుఖ్ కొట్టేసాడు.

అయితే ఈ సినిమా తోనే తమిళ హీరోయిన్ నయనతార బాలీవుడ్ కి పరిచయం కాగా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి నయనతారకి భారీ ఆఫర్లు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. అయితే ప్రెజెంట్ నయన్ మాత్రం అందుకు పెద్దగా ఆసక్తిగా లేదు అనే మాట వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం నయన్ నో అనలేని ఆఫర్ ఆమె చెంతకి వచ్చినట్టుగా ఇప్పుడు రూమర్స్ మొదలయ్యాయి.

బాలీవుడ్ లో ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన నెంబర్ 1 దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న “బైజు బావ్రా” సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన నటించేందుకు నయన్ పేరునే ఆలోచిస్తున్నారట. నయనతార నటనలో ఏ రేంజ్ లో చేస్తుందో తెలుసు అందుకే ఆ పాత్రకి నయన్ కి ఆఫర్ వచ్చింది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే నయన్ ఇందులో ఓకే చెప్పేలానే ఉందని కూడా అంటున్నారు మరి నయన్ అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఒడిసి పట్టుకుంటుందో లేదో చూడాలి.