టాలీవుడ్ కు నయనతార గుడ్ బై!

Nayanathara
అవును.. మీరు వింటున్నది నిజమే!  నయనతార టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసిందట. నయనతారను దేవతగా కొలుస్తూ ఆరాధిస్తుంటారు తమిళ తంబీలు. తమిళంతో పాటు తెలుగులోనూ నయనతారకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగు ఆడియెన్ లో వీరాభిమానులే ఉన్నారు.
 
అయితే నయన్ కి ఉన్న కొన్ని పరిమితుల వల్ల తెలుగు సినిమాల్లో ఇటీవల ఎక్కువగా నటించే అవకాశం లేకుండా పోతోంది. అగ్ర  హీరోల రేంజ్  సినిమాలు మినహా నయన్ వేరే ఏవీ అంగీకరించడం లేదు. భారీగా పారితోషికం ముడితేనే తెలుగు సినిమాలకు ఓకే చెప్పేది.
 
Nayanathara
Nayanathara
 
కానీ తాజా సన్నివేశం చూస్తుంటే సీన్ వేరేలా కనిపిస్తోంది. ఇక నయనతార తెలుగు సినీపరిశ్రమకు గుడ్ బై చెప్పేసే సమయం వచ్చేసిందని చెబుతున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ప్రమోషన్ లు తప్పనిసరి చేసిన నేపథ్యంలో తెలుగు సినిమాలు నుంచి దాదాపుగా నయన్ తప్పుకున్నట్లే అని టాక్  ఇండస్ట్రీలో జోరుగా మొదలైంది.
 
నయనతార ప్రస్తుతం హబ్బీ విఘ్నేష్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంతో పాటు రజనీకాంత్ సినిమాలోనూ నాయికగా నటిస్తోంది. తమిళ అగ్ర హీరోలు నయన్ కాల్షీట్ల కోసం పడిగాపులు పడుతున్నారన్నమాట నిజమే. తమిళంలో తలైవి రేంజుకు ఎదిగిన నయనతారకు తమిళులంటే అమితమైన ప్రేమ. నయనతారను దేవతగా కొలుస్తూ ఆరాధిస్తుంటారు తమిళ తంబీలు. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ తమిళ పరిశ్రమను మాత్రం నయన్ వదిలి పెట్టేదే లేదు అని చెబుతున్నారు.