మెగా ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయన్

Nayanathara

సీనియర్ హీరోయిన్ నయనతార ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి నటన పరంగా మెప్పించగలిగే అతికొద్ది మంది నటిమణుల్లో నయనతార ఒకరు. అయితే ఆమె ఇటీవల ఒక మెగా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

మెగాస్టార్ చిరంజీవితో ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. చిన్న రోల్ అయినా కూడా చేయడానికి వెనుకడుగు వేయరు. కానీ నయనతార మాత్రం చేయలేనని దర్శకుడికి మొహం మీదే చెప్పిందట. మెగాస్టార్ తో ఇదివరకే నయన్ సైరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక లూసిఫర్ లో కూడా ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేయాలని అనుకున్నారు మెగాస్టార్.

మోహన్ రాజా నయనతారకు కథను చెప్పడంతో ఆమె చేయనని చెప్పేసిందట. ఎందుకంటే సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక దర్శకుడు మరొక హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. లూసిఫర్ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు.