Allu Arjun-Atlee: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. కాగా ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల అయ్యి రికార్డులు మోత మోగించిన విషయం తెలిసిందే. ఇకపోతే అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా వినిపించాయి.
సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా చెబుతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమా పై అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఊహించని సర్ప్రైజ్ ఉంటుందట.
ఆ సర్ప్రైజ్ మరేంటో కాదు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో దాదాపుగా ఒక ఐదు నిమిషాల పాటు స్క్రీన్ పై మెరువనున్నట్లుగా తెలుస్తోంది. చిరు క్యామియో సినిమాకు బిగ్ హైలైట్ గా నిలువనుందట. బన్నీ అల్లు అర్జున్ కాంబో మూవీ కోసం చిరంజీవి ఒప్పించినట్టుగా తెలుస్తోంది.. చిరంజీవి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అని చెప్పాలి. ఎందుకంటే ఒకే సినిమాలో అల్లు అర్జున్ చిరంజీవిని చూడాలి అన్న అల్లు అభిమానుల మెగా అభిమానుల కోరిక నెరవేరుతుంది. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.