భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన నయన్… భయంతో వెనుకడుగు వేస్తున్న నిర్మాతలు?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార గ్లామర్ పాత్రలలో నటిస్తూ తన అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో గ్లామర్ పాత్రలలో మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలలో కూడా నటిస్తూ తన నటనతో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా ఈ అమ్మడు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార మొదటి స్థానంలో ఉంది.

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార సినిమా రెమ్యూనరేషన్ విషయంలో చాలా కండిషన్లు పెడుతున్నట్లు నిర్మాతలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఆమె నటించిన ఏ సినిమా ప్రమోషన్స్ కి హాజరుకానని నయనతార కండిషన్ పెట్టింది. ఇక ఇటీవల తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడు కండిషన్స్ లిస్ట్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నయనతార గ్లామర్ పాత్రలలో నటించినని.. అంతేకాకుండా ఒక నిర్ణీత సమయాలలో మాత్రమే షూటింగ్లో పాల్గొంటారని నిర్మాతలకు కండిషన్ పెడుతుందట.

అంతేకాకుండా ఈ అమ్మడు ఈమధ్య రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రూ. ఒక సినిమాకి ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార ఇప్పుడు ఏడు కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక టాలీవుడ్ నిర్మాత స్టార్ హీరో సినిమా కోసం నయనతారను సంప్రదిస్తే ఆమె ఏడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి నిర్మాతకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నయనతార వెంట వచ్చే తన టీం కి కూడా ప్రత్యేకంగా హోటల్ గదులు ఆహార సదుపాయాలు ప్రత్యేక కాన్వాయ్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు నిర్మాత కేవలం నయనతార కోసం మాత్రమే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని భయపడి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.