Manchu Family: మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి సినీ పరిశ్రమ ఇప్పటివరకు మౌనంగా ఉంది. అయితే ఇది పూర్తిగా వారి కుటుంబ వ్యవహారం కావడంతో సినిమా సెలబ్రిటీలు కూడా ఇలా వారి వ్యక్తిగత విషయాల గురించి స్పందించడానికి ఇష్టపడలేదని చెప్పాలి. అయితే ఇటీవల నిర్మాత నట్టి కుమార్ ఓ సమావేశంలో భాగంగా మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ఈ వివాదం గురించి ఈయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చేయడానికి మోహన్ బాబు గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు అవుతుంది ఇలా ఈయన 50 సంవత్సరాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాలని ఆలోచన మాకు ఉండేది కానీ ఇలాంటి సమయంలోనే మంచు కుటుంబంలో ఈ వివాదాలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం. మోహన్ బాబు గారు క్రమశిక్షణకు మారుపేరు ఆయన కుటుంబంలో ఇలాంటి వివాదాలు జరుగుతాయని ఏనాడు అనుకోలేదు అయితే ఈ గొడవలన్నీ కూడా ఆస్తి కోసం అసలు కాదని ఈయన తెలిపారు.
ప్రతి ఒక్క ఇంట్లో కూడా చిన్నచిన్న గొడవలు ఉంటాయి మోహన్ బాబు కుటుంబంలో గొడవలు కూడా అలాంటివేనని వీటన్నింటినీ ఎవరో పరిష్కారం చేయాల్సిన పనిలేదు మోహన్ బాబు గారి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని తెలిపారు. ఇక మోహన్ బాబు గారికి చెప్పే స్థాయి ఎవరికీ లేదు ఆయనకు చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దాసరి నారాయణరావు గారిని ఇప్పుడు ఆయన లేరు కనుక ఈ సమస్యను మోహన్ బాబు గారి పరిష్కరించుకుంటారని తెలిపారు.
మోహన్ బాబు గారు ముక్కుసూటి మనిషి ఏ విషయం అయినా నిర్మొహమాటంగా మాట్లాడుతారు.ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. 2 నిమిషాలు సరిపోదు. ఈ 50 ఏళ్లలో సినీ పరిశ్రమను టైగర్‌గా, పులిగా శాసించారు. దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీలో మొహమాటం లేకుండా మాట్లాడేది మోహన్ బాబు గారి ఆయన కుటుంబానికి ఏదో నరఘోష తగిలింది. త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని నట్టి కుమార్ తెలిపారు.
మంచు ఫ్యామిలీలో గొడవలు దురదృష్టకరం: నట్టి కుమార్
మోహన్ బాబు ముక్కుసూటి మనిషి
ఇండస్ట్రీలో ఓ టైగర్
మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది
ఏదో నరఘోష తగిలినట్లుంది
ఒక్క మోహన్ బాబుకి తప్ప మంచు ఫ్యామిలీ వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరు
– నట్టి కుమార్@themohanbabu @iVishnuManchu… pic.twitter.com/9KtaPHUyUO
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024