Shyam Singha Roy:బుల్లితెరపై అలరించనున్న శ్యామ్‌ సింగరాయ్‌ ..!

Shyam Singha Roy:నేచురల్‌ స్టార్‌గా ఎదిగిన నాని తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో  డిసెంబర్‌ 24న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు నాని పోషించారు.ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 21న శ్యామ్ సింగరాయ్ సినిమాని విడుదల చేశారు. వాటిలో కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాకు మంచి ఆదరణ లభించింది.

ఈ మూవీ త్వరలో వరల్డ్ ప్రీమియర్ షో గా బుల్లితెర ఫై సందడి చేయబోతుంది.ప్రముఖ జెమినీ ఛానల్ లో ఈ మూవీ ప్రసారం కాబోతుంది. వెండితెర ఫై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్లు రాబట్టిన శ్యామ్..బుల్లితెర ఫై ఏ రేంజ్ లో సందడి చేస్తాడో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత నాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ‘అంటే సుందరానికి’ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. దీని తర్వాత శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో వస్తున్న ‘దసరా’ సినిమా పనిలో ఉన్నాడు.