ప్రతి సినీ ఇండస్ట్రీలో కూడా ఓ మంచి సమయంలో అయితే బాక్సాఫీస్ దగ్గర భారీ యుద్ధాలు తప్పనిసరి దీనితో ఓ భారీ చిత్రం వస్తుంది అంటే ఆటోమాటిక్ గా ఆ సమయం నుంచి పలు చిత్రాలు తప్పుకోవడం జరురుగుతుంది. అలాగే ఈ ఏడాదిలో కూడా ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భారీ క్లాష్ లు పడ్డాయి.
అయితే ఏడాది ముగింపుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” ని అయితే డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడంతో అప్పటికే రిలీజ్ డేట్ ని దగ్గర పెట్టుకొని ఉన్న నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం “సైంధవ్” లు ఉన్నాయి.
కానీ సలార్ దెబ్బతో ఐయే అనుకున్నట్టుగా రిలీజ్ డేట్ లను ఈ చిత్రాలు మార్చుకున్నాయి. కాగా ఈ చిత్రాల్లో అయితే “సైంధవ్” వచ్చే ఏడాదికి షిఫ్ట్ కాగా నాని సినిమా మాత్రం కాస్త ముందే వస్తున్నట్టుగా ఈరోజు టీజర్ తో అనౌన్స్ చేశారు. దీనితో నాని ముందుకు వచ్చినట్టు అయ్యింది.
కాగా ఇదే అంశంపై ఈరోజు మీడియాలో ప్రశ్న అడగ్గా నాని అదిరిపోయే సమాధానం అందించాడు. ఒక కుటుంబంలో అన్నయ్య ఫంక్షన్ ఏదన్నా ఉంటే తమ్ముడు తన డేట్ ని మార్చుకోడా ఇది కూడా అలాంటిదే అని ప్రభాస్ పై తనకున్న ప్రేమను వ్యక్తం చేసాడు. దీనితో నాని ఇచ్చిన ఆన్సర్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. దీనితో అలా ఈ ఆన్సర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.