మా పరిస్థితి కూడా అంతే.. విగ్‌పై నాగబాబు కామెంట్స్ వైరల్

Nagababu Satires On wig In Bomma Adirindhi

బొమ్మ అదిరింది షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. జబర్దస్త్‌కు పోటీగా నితిన్ భరత్, నాగబాబు అందరూ కలిసి అదిరింది అనే షోను ప్రారంభించారు. ఓ 25 ఎపిసోడ్‌లు బాగానే లాగించారు. ఇక ఆపై ఆ షోను బొమ్మ అదిరిందిగా మార్చేశారు. ఇలా మార్చడంతో షో లెవెల్ మారిపోయింది. మొదటి ఎపిసోడ్‌తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ప్రతీ వారం కొత్తగా గెస్ట్‌లను పిలుస్తూ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.

Nagababu Satires On wig In Bomma Adirindhi
Nagababu Satires On wig In Bomma Adirindhi

ఇక ఈ బొమ్మ అదిరిందిలో శ్రీముఖి, డ్యాన్సర్ పండు, జానీ మాస్టర్, నాగబాబు వేసే పంచులు బాగా వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా నాగబాబు స్కిట్ల మధ్యలో వేసే సెటైర్లు బాగానే వైరల్ అవుతుంటాయి. గతవారంలో అగ్రిమెంట్ అధారంగా చమ్మక్ చంద్ర స్కిట్ వేశాడు, ఆ టాస్క్‌లో భాగంగా కౌంటర్లు వేస్తూ.. పరోక్షంగా మల్లెమాల, జబర్దస్త్ షోను టార్గెట్ చేశాడు. అగ్రిమెంట్ల పేరుతో పది లక్షలు వసూళ్ చేస్తారంటూ కామెంట్స్ చేశారు.

నాగబాబు చేసిన ఆ కామెంట్స్ బాగానే హల్చల్ చేశాయి. తాజాగా తన విగ్‌పైనా నాగబాబు సెటైర్లు వేసుకున్నాడు. స్కిట్‌లో భాగంగా జుట్టులేని ఓ వ్యక్తి దువ్వెనను చూసుకుంటూ మురిసిపోతాడు. ఆ సమయంలో నాగబాబ స్పందిస్తూ.. మా పరిస్థితి కూడా అంతేరా అంటూ తన విగ్‌పై తానే సెటైర్ వేసుకున్నాడు. నాగబాబు అలా విగ్‌పై సెటైర్ వేసుకోవడంతో అందరూ పగలబడి నవ్వేశారు.

Nagababu Satires On wig In Bomma Adirindhi
Nagababu Satires On wig In Bomma Adirindhi