ఆయన ప్లేస్‌లో ఉండుంటే రూ. 2వేల కోట్లు సంపాదించేవాడిని : నాగబాబు

NagaBabu About Money Importance

ముక్కుసూటిగా, నిక్కచ్చిగా మాట్లాడే తత్త్వం ఉన్నవాడు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన మాటలకు ఎవ్వరైనా ముగ్దులు కావాల్సిందే. జీవిత సత్యాలను సాధారాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎంతో సరళంగా విడమరిచి చెబుతాడు. యూట్యూబ్‌లో నాగబాబు పెట్టే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాను అనుభవించిన కష్టాలు, ఎందరి జీవితాలనో చూసిన అనుభవాన్ని రంగరించి ఎన్నెన్నో మంచి మాటలు చెబుతుంటాడు.

NagaBabu About Money Importance
NagaBabu About Money Importance

తాజాగా నాగబాబు డబ్బుకు ఉన్న ప్రాధాన్యం గురించి వివరించాడు. ‘జీవితంలో డబ్బు ముఖ్యమా? ప్రేమ అనురాగాలు ముఖ్యమా? డబ్బుతో అన్నీ కొనలేము.. డబ్బుతో కొనలేనివీ కూడా ఉంటాయ్ అని ఎన్నో సోది మాటలు వింటుంటా.. అవును నిజమే అవన్నీ కచ్చితంగా సోది మాటలే కానీ డబ్బు సంపాదించడం అనేది గ్రేట్ పని. అదొక ఆర్ట్. డబ్బులు సంపాదించుకుండా ఇంట్లోనే కూర్చుంటే పిల్లలు కూడా గౌరవించరు. బాధ్యతలు తీర్చుకోవాలి అంటే ప్రేమలు అభిమానాలు దొరకవు.

పేరు చెప్పను గానీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. చాలా బిజీగా ఉండేవాడు.. ప్రతీ ఒక్క స్టార్ ఆయన కోసం ఎదురుచూసేవారు.. ఆయన అప్పుల మీద అప్పులు చేసి మొత్తం కోల్పోయారు. ఆయన ప్లేస్‌లో నేను గనుక ఉంటే రెండు వేల కోట్లు సంపాదించేవాడిని. డబ్బును నిజంగా గౌరవించాలి. డబ్బు చెడ్డది అని చెప్పేవాళ్లకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది. డబ్బు ఎప్పుడైనా గొప్పదే. ప్రతి మనిషి కూడా డబ్బును సంపాదించగలడు. చేతులు కాళ్ళు లేని వాడు కూడా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు’ అంటూ ఓ వీడియోను వదిలాడు. అయితే ఇంతకీ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరై ఉంటారబ్బా అని అందరూ ఆరా తీస్తున్నారు.