అలాంటి అగ్రిమెంట్లతో బెదిరిస్తారు… మల్లెమాలను వదిలిపెట్టని నాగబాబు!

Nagababu About Chammak Chandra Agreements SKit In Bomma Adirindhi

జబర్దస్త్ షోతో నాగబాబుకు ఉన్న బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. నాగబాబు ఒకప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుందు జబర్దస్త్ షోనే. అంటే నాగబాబుకు సాయం చేసింది మల్లెమాలనే. ఏడేళ్లు అంతా బాగానే ఉంది. జబర్దస్త్ ఓ రేంజ్‌లో ఎదిగింది. నాగబాబు అంతుకు మించి ఎదిగిపోయాడు. అయితే జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ బయటకు వచ్చాక.. వారిని సపోర్ట్ చేసేందుకు నాగబాబు జబర్దస్త్‌ను వదిలేయడంతో అసలు కథ మొదలైంది. అదిరింది షోను ప్రారంభించే కంటే ముందు నాగబాబు తన యూట్యూబ్ చానెల్‌లో కొన్ని వీడియోలు షేర్ చేశాడు.

జబర్దస్త్‌లో ఉండే లొసుగులు, మల్లెమాల ఎలా ప్రవర్తించేది వంటి విషయాలను చెబుతూ నెగెటివిటీ పెంచేలా చేశాడు నాగబాబు. అదంతా ముగిసిన కథ. ఎంచక్కా నాగబాబు అదిరింది షోను చేసుకుంటున్నాడు. కిందా మీదా పడి దాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే అదిరింది కాస్త మెరుగులు దిద్ది బొమ్మ అదిరిందిగా మళ్లీ మొదలెట్టారు. బొమ్మ అదిరింది షో బాగానే పాపులర్ అయింది. వారం వారం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ బాగానే హైలెట్ అవుతోంది.

Nagababu About Chammak Chandra Agreements SKit In Bomma Adirindhi
Nagababu About Chammak Chandra Agreements Skit In Bomma Adirindhi

ఇక తాజాగా మల్లెమాల, వాటి కాంట్రాక్ట్‌ల మీద నాగబాబు సెటైర్ వేశాడు. చమ్మక్ చంద్ర వేసిన కాంట్రాక్ట్ పని మనిషి స్కిట్‌ మీద నాగబాబు పంచ్‌లు వేశాడు. కానీ అవి పరోక్షంగా మల్లెమాలను ఉద్దేశించి అన్నాడని అందరికీ తెలుసు. స్కిట్‌లో భాగంగా చమ్మక్ చంద్ర ఓ ఇంటికి కాంట్రాక్ట్ మీద పని మనిషిగా వెళ్తాడు. తనంతట తాను వెళ్తే యజమానికి పది లక్షలు చెల్లిస్తానని, ఒక వేళ వాళ్లు తీసేస్తే పది లక్షలు చెల్లించాలని కాంట్రాక్ట్ పెట్టుకున్నట్టు పేర్కొన్నాడు. దానిపై నాగబాబు కామెంట్ చేస్తూ మీ కాంట్రాక్ట్ న్యాయంగా ఉంది.. కొందరైతే వాళ్లు పీకేసినా, మనం వెళ్లినా పది లక్షలు కట్టించుకుంటారు.. మరీ దారుణంగా ఉంటాయి.. బెదిరిస్తారంటూ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

Nagababu About Chammak Chandra Agreements SKit In Bomma Adirindhi
Nagababu About Chammak Chandra Agreements Skit In Bomma Adirindhi