ఆ విషయంలో సంతోషంగా ఉంది.. ఎలాంటి బాధ లేదు… నాగచైతన్య కామెంట్స్ వైరల్?

అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈనెల 22వ తేదీ విడుదల కానుంది. ఇక విడుదలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో భాగంగా నాగచైతన్య మాట్లాడుతూ తాను దాదాపు 12 సంవత్సరాల క్రితం రాజు గారి నిర్మాణంలో సినిమా చేశాను. అయితే ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆయన నిర్మాణంలో తిరిగి థాంక్యూ సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇకపోతే ఇన్ని రోజులు ఈయన నిర్మాణంలో సినిమాలు చేయలేదని బాధ తనకు ఏ మాత్రం లేదని,ఇన్ని రోజులపాటు వేచి ఉన్న థాంక్యూ వంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నాగచైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ పాత్రలో రాశి ఖన్నా నటిస్తున్నారు. అలాగే మాళవిక నాయర్, అవికా గోర్ వంటి హీరోయిన్లు ఈ సినిమాలో సందడి చేయనున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య అభిరామ్ అనే పాత్రలో మూడు షేడ్స్ కనిపించనున్నారని ఈ సినిమా ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ఆలోచనలను కలిగిస్తుంది అంటూ నాగచైతన్య వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచాయి మరి ఈ సినిమా ఏ విధమైనటువంటి టాక్ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.