హాలీవుడ్ సినిమా నుంచి నాగ చైతన్య “తండేల్” ఫస్ట్ లుక్ కాపీ??

ఈ ఏడాదిలో అక్కినేని హీరోస్ కి ఏమంత గొప్పగా కలిసి రాలేదనే చెప్పాలి. అక్కినేని నాగార్జున మినహా మిగతా హీరోస్ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కి వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇద్దరి సినిమాలు కూడా వారి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ లు గా నిలిచాయి. అయినా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ లు గా అఖిల్ మరియు నాగ చైతన్య లు ఇద్దరూ కూడా సెన్సేషనల్ ప్రాజెక్ట్ లను తమ తదుపరి సినిమాలుగా ఫిక్స్ చేసుకున్నారు.

అయితే ఈరోజు నాగ చైతన్య బర్త్ డే కానుకగా తన 23వ సినిమా నుంచి ఐతే అవైటెడ్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని కూడా ఈరోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసేసారు. కాగా ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ వారు టేకప్ చేయగా నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సినిమా రాబోతుంది.

మరి ఈ సినిమాకి “తండేల్” అంటూ ఒక డిఫరెంట్ టైటిల్ ని మేకర్స్ రివీల్ చేయగా ఇందులో నాగ చైతన్య ఎలా కనిపిస్తాడు అనేది కూడా రివీల్ చేశారు. అయితే మరి ఈ స్టిల్ లో చైతు చూసేందుకు బాగానే ఉన్నాడు కానీ ఈ లుక్ చూస్తే ఆల్రెడీ చూసినట్టే ఉందని కొందరు నెటిజన్స్ అంటున్నారు.

హాలీవుడ్ చిత్రం “ఆక్వా మ్యాన్” నుంచి ఈ తరహా ఓ పోస్టర్ ఉంటుంది దీనితో ఒకేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా రెండు సినిమాలు కూడా సముద్ర నేపథ్యం లోనివే కావడం మరో ప్రధాన హైలైట్. మరి కావాలని చేసిందో యాదృచ్చికమో కానీ ఆ పోస్టర్ తో దీనిని ఇప్పుడు కంపేర్ చేస్తే కాపీ అనే అంటారు అంతా