మెగా బ్రదర్ నాగబాబు తమ మెగా ఫ్యాన్స్ ఎంత కలిసిమెలిసి ఉంటాడో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఏ సమస్యను చెప్పుకోవాలన్నా, చిరంజీవితో అనుసంధానం చేయాలన్నా మధ్య వారధిలా ఉంటాడు నాగబాబు. మెగా ఫ్యాన్స్‌ను ఆర్గనైజ్ చేయడంలో నాగబాబు ముందుంటాడు. తమ ఫ్యాన్స్‌కు సాయం చేయడంలోనూ ముందుంటాడు. అలాంటి నాగబాబు తాజాగా తమ వీరాభిమాని కూతురి పెళ్లికి వెళ్లాడు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు.
మెగా ఫ్యాన్స్ మరణించినా, వారికి ఏదైనా అయినా కూడా మెగా హీరోలు స్పందిస్తుంటారు. తక్షణమే సహాయసహకారాలు అందిస్తుంటారు. అలా మెగా హీరోలెప్పుడూ కూడా తమ ఫ్యాన్స్ కోసం కదిలివస్తుంటారు. తాజాగా నాగబాబు కూడా అలాగే కదిలాడు. మెగా వీరాభిమాని అయిన స్వర్గీయ రవికాంత్ కూతురు చిలసౌ కౌశిల్ వివాహానికి వెళ్లాను అంటూ నాగబాబు తన సంతోషాన్ని, ఆనందాన్ని, బాధను పంచుకున్నాడు. తమ అభిమాని మరణించినప్పుడు వెళ్లేకపోయానని నాగబాబు బాధపడ్డాడు.
అసలు నిజం ఏంటంటే.. రవికాంత్ చనిపోయినప్పుడు చివరి చూపు చూసేందుకు వెళ్లలేకపోయాను.. ఆ బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆశీస్సులతో పాటు మా ఫ్యామిలీ ఆశీస్సులు కూడా ఆయన కూతురితపై ఉంటాయి.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్.. మీరెప్పుడూ ఇలా కలిసిమెలిసి ఉండాలి అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం నాగబాబు అటెండ్ అయిన పెళ్లి, వాటికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.