Naga Shourya : కృష్ణ వ్రీందా విహారి గా రానున్న నాగ శౌర్య…!

Naga Shourya : నటన, డాన్సులు అన్నింటిలోనూ బాగున్నా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. అలాగే ఉంది టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య పరిస్థితి. వరుస సినిమా లు చేస్తూనే ఉన్న ఆశించినంత విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఛలో సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న ఆ తర్వాత ఆ విజయాన్ని సరిగా వాడుకోలేక పోయాడు. కణం లాంటి ప్రయోగాలు చేసిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక అమ్మమ్మ గారి ఇల్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చినా టెలివిజన్ లో అయితే చూడొచ్చు అనేలా ఉంది. ఇక ఇటీవలే వచ్చిన అశ్వధామ కూడా నిరాశను మిగిల్చింది. ఇక నాగ శౌర్యా ప్రస్తుతం డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. కృష్ణ వ్రీందా విహారి గా రానున్న శౌర్య.ఇక ఈ సినిమా లో నాగ శౌర్య కు జోడిగా షిర్లే షెటియా హీరోయిన్ గా నటిస్తోంది.నాగశౌర్య సొంత బ్యానర్ అయిన ‘ఐరా’ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి. టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.