Nani : యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నాని సినిమా…!

Nani : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టిన నాని అష్టా చమ్మా సినిమాతో హీరోగా సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక పక్కింటి కుర్రాడు లా కనిపించే తన అభినయంతో అభిమానులను సంపాదించుకున్నాడు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది అన్న క్రేజ్ సంపాదించాడు. అంతేకాకుండా ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన v సినిమాలో తనలోని నెగిటివ్ షేడ్ ని కూడా చూపించి అందరిచేత వావ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం నాని శ్యామ్ సింగ రాయ్ విజయం తర్వాత అంటే సుందరానికి.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో మొదటిసారి బ్రాహ్మణ యువకునిగా నటిస్తున్నాడు నాచురల్ స్టార్.

అయితే తాజాగా నాని నటించిన ఒక చిత్రం యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. వివరాలలోకి వెళితే… త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం నేను లోకల్. ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నాని కెరీర్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు 18 కోట్లతో నిర్మించిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి లాభాలను తెచ్చిపెట్టింది. మ్యూజికల్ గా కూడా సంగీత ప్రియులను అలరించింది.

కాగా ఈ సినిమాని ఇటీవల యూట్యూబ్లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ నీ రాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.నాని కెరీర్ లో నే యూట్యూబ్ లో అరుదైన రికార్డు అందుకున్న సినిమాగా నేను లోకల్ సినిమా నిలిచింది.