SSMB29 – మహేష్ రోల్ కి కూడా రాజమౌళి పురాణ ప్రేరణ.!

ss-rajamouli-announces-new-movie-with-mahesh-babu

మన దేశపు ఇతిహాసాలు పురాణాలు ఇప్పటికీ కూడా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తూ వస్తున్నాయి. ఎన్నెన్నో సినిమాలు కూడా రామాయణం, భాగవతం లాంటి పురాణాలూ ఆధారంగా గాని వాటిలో కొన్ని సంఘటలు లేదా అందులో పాత్రల ఆధారంగా సినిమాలు నేటి తరానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నారు.

మరి వీటిని బాగా అనుసరించే దిగ్గజ దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఒకరు. తన బాహుబలి సినిమా కూడా భారతం ఆధారంగానే చేసానని అలాగే చాలా సినిమాల్లో ప్రకృతి గాని పురాణాల సంబంధిత షేడ్స్ గాని తన సినిమాల్లో ఉంటాయి. ఇప్పుడు ఇదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న మాసివ్ బడ్జెట్ సినిమా కోసం తెలిసిందే.

మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా దీనిని తెరకెక్కించనుండగా ఈ సినిమా ఓ భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అయితే తెరకెక్కనుంది అని తెలిసిందే. కాగా ఈ సినిమాలో మహేష్ పాత్రకి అయితే ప్రేరణగా రాజమౌళి మహా బలుడు హనుమాన్ భగవాన్ ని అయితే తీసుకున్నాడట.

అతని ఆధారంగా మహేష్ పాత్ర కూడా అంత పవర్ ఫుల్ గా ఆ సినిమాలో కనిపిస్తుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఈ సెన్సేషనల్ బజ్ అయితే సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ ఏడాది లోనే స్టార్ట్ కానుండగా ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.