ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో ఓ విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా పదే పదే అవగాహనను కల్పిస్తుంటారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్ల వలలో ఎంతో మంది అమాయకులు చిక్కుతున్నారు. కొంతమంది వేలు, మరి కొంత మంది లక్షల్లో మోసపోతున్నారు. ప్రతీ ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లు వాడుతూనే ఉంటారు. ఏవేవో లింకులు పంపిస్తుంటారు.. ఫోన్‌లు చేస్తుంటారు.. ఏదో చెబుతారు.. మాటల్లో పెడుతూ మన డబ్బులను కాజేస్తారు.
అలా సైబర్ నేరగాళ్ల ఆటలు ఎక్కువవుతున్నాయి. ఇలా వారి చేతికి చిక్కి ఎంతో మంది మోసపోతున్నారు. ఇలా ఈ క్రమంలో సంగీత దర్శకుడు కోటి కూడా మోసపోయాడట. ఈ మేరకు తనలా మరెవ్వరూ మోసపోకూడదని అవగాహన కలిగించేందుకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో భాగంగా ఈ వీడియోలో ఎన్నో విషయాలను చెప్పాడు. మోసపోయాను.. దారుణంగా మోసపోయాను అంటూ కొన్ని విషయాలను బయటకు చెప్పాడు.
ఏదో పని నిమిత్తం జస్ట్ డయల్‌కు ఫోన్ చేశాను. వారు ఓ నంబర్ పంపారు. దాన్ని స్కాన్ చేసి ఐదు వేలు పంపాను. అలా మొత్తం వారు నా దగ్గరి నుంచి 45 వేలు కాజేశారు. చివరకు నాకు అర్థమైంది. నేను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాను అని కోటి చెప్పుకొచ్చాడు. అందరూ తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.. సైబర్ నేరగాళ్లకు చిక్కుకోకండని కోటి వేడుకున్నాడు.