ముమ్ముట్టి సినిమా పోస్టర్‌ విడుదల!

మలయాళీ మెగాస్టార్‌ మమ్ముట్టి సినిమా వస్తోందంటే చాలు.. అటు మలయాళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. ఇక యాత్ర , ఎజెంట్‌ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ మెగాస్టార్‌. మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం భ్రమయుగం భూతకాలం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్‌ పోస్టర్‌ వదిలిన మేకర్స్‌ మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా నేడు సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మమ్ముట్టి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో మమ్ముట్టి చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది.