ముమైత్ ఖాన్ గత రెండు మూడు రోజులుగా వార్తల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గోవా ట్రిప్ కోసం మూడు రోజులను క్యాబ్‌ను మాట్లాడుకున్న ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని డ్రైవర్ వాపోయాడు. మీడియా, డ్రైవర్ అసోసియేషన్ల ముందు తన గోడును వెల్లిబుచ్చుకున్నాడు. ఈ వార్తలు వైరల్ కావడంతో తాజాగా ముమైత్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. క్యాబ్ డ్రైవర్ రాజుపై కంప్లైంట్ ఇచ్చింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసలు నిజాలు చెప్పింది. క్యాబ్ డ్రైవర్ రాజు తనపై చేసిన ఆరోపణలను ఖండించింది. గోవా ట్రిప్‌కు తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్ రాజుకు తాను పూర్తిగా డబ్బులు చెల్లించానని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ముమైత్ ఖాన్ తెలిపింది. పూర్తిగా డబ్బు చెల్లించలేదనిడ్రైవర్ రాజు చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది
డ్రైవర్ రాజు నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అతడు ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడ్డాడని, గోవా పర్యటనలో తనను భయాందోళనకు గురిచేసి వేధించాడని పేర్కొంది. ఒక క్యాబ్ డ్రైవర్‌ను మోసం చేసే క్యారెక్టర్ తనది కాదని, ఈ వ్యవహారంలో మీడియా తన క్యారెక్టర్‌ను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిందని ఫైర్ అయింది. డబ్బుల కోసం రాజు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతను తనను చంపేంత కూడా ప్రయత్నం చేశాడని ఆరోపించించింది.