అన్వేషి జైన్.! మరో స్పెషల్ సాంగ్.!

అన్వేషి జైన్ తెలుగులో ‘సీసా’ స్పెషల్ సాంగ్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా కోసం ఈ స్పెషల్ సాంగ్‌ని తెరకెక్కించారు. సినిమా ఫ్లాప్ అవడంతో, అన్వేషి జైన్ సోదిలో లేకుండా పోయింది.

అయితే, ఇంకోసారి ఈ భారీ అందాల భామకి తెలుగునాట ఓ మంచి ఆఫర్ వచ్చిందట.! ‘రిపీట్ కాంబో’ అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి వుంది.

ఈసారి స్పెషల్ సాంగ్ మాత్రమే కాదు, స్పెషల్ రోల్ కూడా.. అంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఈ భామ తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తెరవెనుకాల చేయాల్సిన ప్రయత్నాల్నీ చేస్తూనే వుందట. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయని తెలుస్తోంది.

ఒకటి కాదు, బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో అన్వేషి నటించబోతోందిట. ఓ వెబ్ సిరీస్‌కి సైతం అన్వేసి సైన్ చేసినట్లు తెలుస్తోంది.