‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంతో ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపును అందుకుంది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో మృణాల్ తనలోని హవభావాలకు తిరుగేలేదు.తనలోని అందానికి కొదువలేదు.ఇక నటనలో నిజాయితీకి తగ్గేదేలేదు.ఇది మృణాల్ ఏర్పరుచుకున్న సిగ్నేచర్.
ఆగస్ట్ 1న తన పుట్టిన రోజున సందర్బంగా పలు సినీ ప్రముఖుల నుండి విషెష్ అందుతున్నాయి. ఈ అమ్మడు తెలుగులో ఎన్ని సినిమాల్లో నటించినా ‘సీతా రామం’ తర్వాతే ఏదైనా అనేలా సినీ అభిమానుల్లో ఓ మార్క్ క్రియేట్ చేసింది. ఎంతలా అంటే ఈ సినిమాలో దుల్కర్ చెప్పే డైలాగ్ ఉంటుంది చూశారా.
‘కురుక్షేత్రంలో రావణ సంహారం..యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం’ అంటూ పలికిన డైలాగ్స్..ఎంతో అర్దాన్ని తెలియాజేశాయి. ఈ మూవీలో లెటర్స్ తో.. సీత, రాముడి డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తూ..ఒక్కసారిగా క్లైమాక్స్ తో అందరికి కళ్ళలో కంటనీరు వచ్చేలా దుల్కర్, మృణాల్ నటించారు .దీంతో మృణాల్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు.
ఇక ఈ మూవీలో లెప్టినెంట్ రామ్‌గా దుల్కర్ నటించగా.. సీతగా, నూర్జహాన్ గా మృణాల్ సహజన నటనను కనబరిచింది. ఈ మూవీని థియేటర్లో చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరిని కదిలించింది. సీతగా తాను నటించిన పాత్ర అందరి గుండెలను హత్తుకుంది. అందుకే సీతగా నటించిన మృణాల్ స్థానం తెలుగు ఆడియన్స్ మనసుల్లో ఎప్పటికీ పదిలం.
ఇక మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే..స్టార్ హీరోయిన్‌గా పేరు సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ స్టార్ తరువాత కల్కి లో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఆ మధ్య చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’లో నటించనుంది అనే వార్తలు వచ్చాయి కానీ, ఆ విషయం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మహారాష్ట్రకు చెందిన మృణాల్..కెరీర్ స్టార్టింగ్ లో టెలివిజన్ నటిగా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఆపై పలు హిందీ సీరియల్స్‌లో యాక్ట్ చేసి గుర్తింపు పొందింది.