మృనాల్ ఠాకూర్ రిజెక్ట్ చేసేసిందట.! ఎందుకు.?

ఓ పెద్ద నిర్మాణ సంస్థ.. ఓ యంగ్ హీరోతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుని ప్లాన్ చేస్తే, హీరోయిన్‌గా మృనాల్ ఠాకూర్ గురించి వాకబు చేశారట.! ఇంతకీ, మృనాల్ ఠాకూర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందిట.?

మృనాల్ ఠాకూర్.. పరిచయం అక్కర్లేని పేరిది.! ఒకే ఒక్క సినిమా.. రాత్రికి రాత్రి ఆమెని స్టార్‌గా మార్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల్లో మృనాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోందంటే దానిక్కారణం ‘సీతారామం’ సినిమానే.

‘సీతారామం’ తర్వాత మృనాల్ తెలుగులో చేసిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా బాగానే ఆడింది. దాంతో, మృనాల్ ఠాకూర్ స్టార్‌డమ్ మరింత పెరిగింది. ఇంతలోనే పెద్ద కుదుపు ‘ఫ్యామిలీ స్టార్’ రూపంలో.

‘ఆ సినిమాని మృనాల్ చేసి వుండకూడదు..’ అన్న కామెంట్లు అంతటా వినిపించాయి. ఈ విషయం మృనాల్ ఠాకూర్ వరకూ చేరాయి. మామూలుగా అయితే, ఇలాంటి కామెంట్లని మృనాల్ ఠాకూర్ లైట్ తీసుకుంటుంది.

కానీ, ఆ కామెంట్ల ప్రభావమో ఏమోగానీ, పైన ప్రస్తావించుకున్న ఓ ప్రాజెక్టుకి మృనాల్ ఠాకూర్ ‘నో’ చెప్పేసిందట. తన పాత్రకు తగిన ప్రాధాన్యత వుంటేనే, సినిమా ఒప్పుకుంటానని మృనాల్ చెబుతోందిట.

అంతే మరి, పేరు సంపాదించుకోవడం గొప్ప కాదు, సంపాదించుకున్న మంచి పేరుని నిలబెట్టుకోవాలి. ఈ విషంయలో మృనాల్ ఠాకూర్‌ని అభినందించి తీరాలి.