అబ్బో..”హరిహర వీరమల్లు” చాలానే మిగిలుందట.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ తో చేస్తున్న భారీ బడ్జెట్ అండ్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. భారీ స్థాయి ఏక్షన్ అండ్ విజువల్స్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా రిలీజ్ కి అనుకున్న ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ర్టీ వర్గాల నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుస్తుంది. దీనితో అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలానే బ్యాలన్స్ ఉండిపోయిందట. దీనితో అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ ఏమో కానీ ఇంకా ఏకంగా 40 శాతం షూటింగ్ బాలన్స్ ఉండిపోయింది అనేది లేటెస్ట్ టాక్.

దీనితో అనుకున్న దానికన్నా నెమ్మదిగా ఈ సినిమా షూటింగ్ అవుతుంది అని చెప్పాలి. అంటే ఈ మధ్య చేసిన షూట్ అంతా కూడా చాలా మేర కంప్లీట్ అయితే తప్ప సినిమా 60 శాతానికి చేరుకోలేదు. ఇక పవన్ ఉన్న ఈ బిజీ షెడ్యూల్ లో అయితే ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి.

ఇంకా ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ నామినేటెడ్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ షూట్ బ్యాలన్స్ ఉండడం మూలానే సినిమా కొత్త టీజర్ కూడా ఇప్పుడప్పుడే ఇవ్వడం లేదని చెప్పారట.